మేడ్చల్ మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ లో 11.3.2024 సోమవారం రోజున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 150 మందికి బీపీ, షుగర్, కంటి పరీక్షలు, చెవి, ముక్కు, గొంతు పరీక్షలు, వరిబీజం, బీజకుట్టు, గడ్డలు, కణతులు, థైరాయిడ్, చర్మ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, రోగులకు ఉచితంగా మందులను అందజేశారు.
వీరిలో ఇన్ పేషంట్ రోగులను మెడిసిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లి ఉచితంగానే వ్యాధులు నయం చేసి పంపిస్తామని డాక్టర్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఇతిహాస్ గోపాల, డాక్టర్ మేఘన, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ ధృతి, ఆసుపత్రి సిబ్బందితోపాటు, బాబుగౌడ్, శేఖర్, చేరాలు పాల్గొన్నారు.