పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ములుగు సీనియర్ సివిల్ జడ్జి
పట్టు వస్త్రాలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ
భారీగా తరలివచ్చిన భక్తులు
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం కోట గుళ్ళు గణపేశ్వర స్వామికి కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహ అన్న పూజ నిర్వహించారు. పరకాల లలిత నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ లలితాదేవి రాజేశ్వర్ ప్రసాద్ దంపతులు మహ అన్న పూజా కార్యక్రమాన్ని నిర్వహించగా ములుగు సీనియర్ సివిల్ జడ్జి తుమ్మల మాధవి ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి జాగరణ అనంతరం ప్రతి సంవత్సరం స్వామివారికి మహా అన్నపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమాన్ని డాక్టర్ లలితా దేవి రాజేశ్వరప్రసాద్ దంపతులు నిర్వహిస్తున్నారు. మహ అన్న పూజ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు నరేష్ భక్తులకు
తీర్థ ప్రసాదాలను అందజేశారు.