గొల్లపల్లి నేటి ధాత్రి: మహాశివరాత్రి సందర్భంగా చాక్ పీస్ తో తయారు చేసిన ఓకే శివలింగంపై 108 శివ లింగాలను చెక్కాడు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కవి సూక్ష్మ కళాకారుడు సైకిత శిల్పి గాలి పెళ్లి చోలేశ్వర్ చారి. వీరు ఆరు గంటలు కష్టపడి రెండు ఇంచుల శివలింగాన్ని చెక్కి అదే లింగంపై 108 చిన్నచిన్న శివలింగాలను చెక్కినట్లు తెలిపార.
ఎంతో భక్తి పారవశ్యంతో ఈ శివలింగాన్ని రూపొందించినట్లు తెలిపారు.14 వరుసలో ప్రతి వరుసలో 8 లింగాలను చెక్కినట్లు తెలిపారు. ఇదివరకు వేములవాడ లోని రాజరాజేశ్వర స్వామి గర్భాలయ శివాలయాన్ని బియ్యపు గింజలు సగం ఉండేటట్లు గా చెక్కారు. సూక్ష్మ కళాకారుడిగా అనేక సందర్భాల్లో చారి ప్రభుత్వం చే ఉత్తమ చిత్రకారుడిగా, ఉత్తమ సైకత శిల్పిగా, ఉత్తమ ఉపాధ్యాయునిగా 2024 లో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆవార్డులు పొందారు. సుద్ద ముక్కలతోపాటు ఆకులు, పాలు, నీళ్లు, బియ్యం గింజలు ఇతర వస్తువుల మీద కూడా శిల్పాలు చెక్కడం లో నేర్పరి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి పలు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. వీరు ప్రస్తుతం వేములవాడలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రాఘవపట్నం గ్రామ పెద్దలు గ్రామస్తులు శివ భక్తులు అందరూ చోలేశ్వర్ చారిని అభినందించారు.