
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు!!
ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామ రైతుల కోరిక మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అంబారిపేట, కొండాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం మండల పరిషత్ ఎంపిటిసి నిధులనుండి శనివారం బోర్ వెల్ వేయించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులంతా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తమ దాహార్తిని తీర్చేందుకు బోర్ వెల్ వేయించిన ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం కు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో,పిసిసి కార్యవర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, నాయకులు సింగతి వెంకటస్వామి, దర్శనాల లక్ష్మణ్, మన్నే జితేందర్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు