చందుర్తి, నేటిదాత్రి:
చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట జెడ్పిటిసి నాగం కుమార్, ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.