సమాజాన్ని జాగృతపరిచేవి కళలని తూప్రాన్ ఆర్టీవో జై చంద్రారెడ్డి

– డి ఎస్ పి రాజేష్…..

*కవులకు కళాకారులకు మెట్టినిల్లు
మెదక్ జిల్లా….

కొల్చారం, (మెదక్ )నేటి ధాత్రి:-
ఏడుపాయల నవదుర్గ భవాని అమ్మవారి జాతర మూడు రోజులు నిర్వహణలో భాగంగా మొదటి రోజు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పాలన యంత్రాంగం ఆధ్వర్యంలో ఏడుపాయల జాతర ప్రాంగణంలో అధికారికంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల కార్యక్రమానికి తూప్రాన్ ఆర్డీవో
జై చంద్రారెడ్డి , ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి , చైర్మన్ బాలగౌడ్ పోలీస్ యంత్రాంగం తరపున డిఎస్పి డాక్టర్ రాజేష్ , ఏడి మైన్స్ జయరాజ్ సంబంధిత వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా దేశభక్తి ,తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన జిల్లాలోని వివిధ కళాకారులు భరతనాట్యాలు , పాటలు రూపంలో దేశభక్తిని ఆధ్యాత్మిక భక్తి భావాన్ని ఇమిడింపు చేశారు.
ఈ సందర్భంగా తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి , డి. ఎస్. పి రాజేష్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తి కళలకు ఉందని అన్నారు.మంచి నైపుణ్యం గల ,కళాకారులు జిల్లాలో అనేక మంది ఉన్నారని, వారు చేసే సాంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి కనువిందు చేస్తాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు ప్రభుత్వం విశేష ఆదరణ కలిపిస్తుందని అన్నారు. వారిలో ఉన్న ప్రతిభాపాటవాలు సమాజానికి అవగతమవుతాయన్నారు. దేశభక్తి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మహాశివరాత్రి, వనదుర్గ అమ్మవారి ఆధ్యాత్మిక భావన ఉట్టిపడే పాటలు కళ్లకు కట్టినట్టుగా పాటలు నృత్యాల రూపంలో ద్వారా వినిపించారని
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!