నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
ఎండిన పంటలు అంచనా వేసి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం మండల పరిధిలోని పలు గ్రామాలు అప్పాజీపేట, కంచనపల్లి, అనంతరం, కొత్తపల్లి, జి చెన్నారం గ్రామాలలో ఎండిన పంట పొలాలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగుచేసిన పంట పొలాలు తమ కళ్ళముందే చేతికొచ్చే సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి రైతులు అనేక ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో రైతులు నిబ్బరంగా ఉండాలని రైతులను కోరారు. ఇలాంటి విపత్కర సమయాలలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. నివారించడం కొరకు ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే నష్టపోయిన పొలాలను పర్యవేక్షించిపంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ముందు చూపుతో వ్యవహరించి ఎస్ఎల్బీసీ కాల్వకు నీళ్లు వదిలినట్లయితే ఎంతో కొంత భూగర్భ జలాలు పెరిగి పంటలు ఎండిపోకుండా ఉండడానికి దోహదపడేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు రైతుల పంటలను త్వరగా అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐఎం మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ రైతులు పోషబోయిన యాదయ్య, దేప రామకృష్ణారెడ్డి, పోషవోని మల్లయ్య, కేతిపల్లి యాదయ్య, కల్లూరి రాములు, పోలే తానేష బకరం చిన్న, కాసర్ల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు