మాల మహానాడు జిల్లా అధ్యక్షులు
అల్లాడి పౌల్ రాజ్.
భద్రాచలం నేటి ధాత్రి
స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్ రాజ్ ఆధ్వర్యంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు కి ఏఎంసి కాలనీలో నివసిస్తున్న ఎస్సీ బీసీ మైనార్టీ నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం లేదా డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించగలరని వినతి పత్రాన్ని అందించడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఏఎంసీ కాలనీలో ఎస్సీ బీసీ మైనార్టీ నిరుపేద కుటుంబాలు అద్దె ఇళ్లలో జీవిస్తున్నారని, రెక్కాడితే గాని డొక్కాడని దుర్భర జీవితం కడుపుతున్న పేద ప్రజలకు గత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకుంటదని ఆశపడ్డ నిరుపేదలకు నిరాశ మిగిల్చిందని, ప్రస్తుత ప్రభుత్వం పేదలకు ఇల్లు లేదా ఇంటి స్థలం తమరి ద్వారా వస్తుందని నమ్మకంతో విన్నవించడం జరుగుతుందని అన్నారు. పేదల స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఏఎంసి కాలనీలో 20 ఇండ్లుగా అద్దె ఇళ్లల్లో నివసిస్తున్న ఎస్సీ ,బీసీ మైనార్టీ కులాల పేదలకు అండగా ఉండి ఆదుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నాగమణి, బర్ల భవాని, మొరంపల్లి అనూష, వాల్లారపు జయమ్మ, సందా మేరీ, మొరంపల్లి పుల్లమ్మ, దరిసిన చర్ల పద్మ, రాచమల్ల కుమారి, మోతుకూరి రమాదేవి, గద్దల శేషమ్మ, కుసుమ,అరుణ, పూసం సుజాత, వెన్నె రేవతి,
ఎస్.కె మోదిన బి, కొంగ లావణ్య తదితరులు పాల్గొన్నారు.