శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో ఈనెల 10 నుండి జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేశారు 10 న ఉత్సవమూర్తుల తిరుమంజనం సాయంత్రం అంకురార్పణం పాటాదివాసం 11న ఉదయం ధ్వజారోహణం అగ్ని ప్రతిష్ట హోమం పూర్ణాహుతి బే రీ పూజ దేవత ఆహ్వానం వాహన సేవ 12న ఉదయం హోమము పూర్ణాహుతి సాయంత్రం శ్రీవారి ఎదుర్కోళోత్సవం వాహన సేవ 13న ఉదయం పూర్ణాహుతి హోమము సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవం అశ్విని నక్షత్రం 14న ఉదయం హో మము పూర్ణాహుతి తిరుప్పావై సేవ సాయంత్రం రాధార o గా హోమం శ్రీవారి రథోత్సవం 15 ఉదయం శతస్థానార్చన హోమం చక్రతీర్థోత్సవం మహాపూర్ణ హుతి సాయంత్రం ద్వాదశరాధన శ్రీ పుష్పయాగం సత్తా వరణ సేవ కుంభ ప్రోక్షణ . 5 రోజులు మాజీ కౌన్సిలర్ తిరుమ ల్ రైస్ మిల్ యజమాని అంగడి నరేందర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఉంటుందని చైర్మన్ తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి కు కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు వనపర్తి లో 1977 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట జరిగిందని శ్రీ త్రిదండి శ్రీమన్ నారాయణ స్వామివారు ప్రతిష్ట చేశారని 9 హోమగుండాలతో చేశార ని తెలిపారు అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించామని చెప్పారు ఆనాడు వెంగల్ రెడ్డి అనేక సహాయ సహకారాలు దేవాలయముకు అందించారని ఆయన పేర్కొన్నారు . మా నాయన నరసింహ చార్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయమునకు ఉచితంగా రెండున్నర ఎకరాల స్థలం ఇచ్చారని అయ్యలూరి రఘునాథ శర్మ తెలిపారు అదేవిధంగా వనపర్తి లో వివిధ అవసరాల నిమిత్తం భూమిని ఉచితంగా ఇచ్చారని రఘునాథ శర్మ విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో అంగడి నరేందర్ మాజీ కౌన్సిలర్ తిరుమ ల్ నాయుడు ఆలయ సిబ్బంది గంగాధర్ పురోహితులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!