-కేదారేశ్వరస్వామి ఆలయ సందర్శన నేపథ్యంలో
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 21వ వార్డులో గల రాజన్న ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి డి.కృష్ణ ప్రసాద్ ఆలయ అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు.దర్శనానికి వచ్చిన పురజనులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా తగు జాగ్రత్తలు తీసుకొమ్మని ఆలయ సిబ్బంది తగు సూచనలు చేశారు.
శ్రీ కేదారేశ్వర ఆలయాన్ని ఈఓ కృష్ణ ప్రసాద్ సందర్శించిన నేపథ్యంలో స్థానిక 21వ వార్డు కౌన్సిలర్ నరాల శేఖర్ వారికి ఘన స్వాగతం పలుకుతూ శాలువాతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు.వీరివెంట ఆలయ ఏఈఓ ప్రతాప నవీన్ కుమార్,అప్పాల కరుణాకర్,పూదరి శేఖర్ వార్డు ప్రజలు నేరేళ్ల శ్రీధర్ గౌడ్ తూపుకారి శ్రీనివాస్, కొప్పుల లింగమూర్తి,నేరేళ్ల ప్రశాంత్, కూరగాయల శేఖర్, ,తదితరులు పాల్గొన్నారు.