# గోదావరి జలాలతో చెరువును నింపి రైతులను ఆదుకోవాలి.
# ఎంసిపిఐ ( యూ ) జిల్లా కమిటీ సభ్యులు కొత్తకొండ రాజమౌళి డిమాండ్.
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని మాదన్నపేట పెద్ద చెరువులోకి గోదావరి జలాలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చోరువ చూపాలని ఎంసిపిఐ (యు)జిల్లా కమిటీ సభ్యులు కొత్తకొండ రాజమౌళి ,రైతు సంఘం జిల్లా నాయకుడు కేశెట్టి సదానందం డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదన్నపేట పెద్ద చెరువు కింద ,పెద్ద కాలువ తైబందీ సుమారు 900 ఎకరాలు పంటకు నీరు అందించడానికి తైబంది ఖరారు అయిందని, దాంతో రైతులు నాట్లు వేశారని అన్నారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే మాదన్నపేట పెద్ద చెరువులో నీరు రోజు రోజుకు అడుగంటుతున్నదని ,మరి కొద్ది రోజుల్లోనే పెద్ద తూముకు నీరు అందే అవకాశం లేదని అవేదన వ్యక్తంచేశారు.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఎండలు తీవ్రమై పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు.ఇప్పటికే రైతులు అప్పులు తెచ్చి దాదాపు 80 శాతం పెట్టుబడి పెట్టారని చెప్పారు.నర్సంపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చొరవ చూపి నది జలాలను చెరువులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఎం సిపిఐ ( యు ) , రైతు సంఘం ప్రజాసంఘాల నాయకులు అనుమాల రమేష్,కలకోట్ల యాదగిరి,మార్త నాగరాజు,సుధా,రాజేందర్,కేశెట్టి శ్రీనివాస్,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.