రామకృష్ణాపూర్, మార్చి 09, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ఉన్న శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకోని ఉదయం బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు, లింగోద్భవకాలంలో అభిషేకాల ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం శివపార్వతుల కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు అంబా ప్రసాద్ నేతృత్వంలో అత్యంత వైభవంగా కనుల పండుగగా ఘనంగా నిర్వహించారు. చిన్నారులు చేసిన సాహిత్య నృత్యాలు, సాంస్కృత కార్యక్రమాలు భక్తులకు ప్రత్యేకంగా అలరించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకోని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తుల జాగరణ కోసం సింగరేణి కమ్యూనికేషన్ సెల్ ఏర్పాటుచేసిన భక్తి భజన పాటలను ఆలాపించడంతో రామాలయం ప్రాంగణమంతా శివనామస్మరణతో మారు మోగిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు చిలుముల కొమరయ్య, ప్రచార కార్యదర్శులు దండు సదానందం, కుమ్మం సురేందర్ ఉపాధ్యక్షుడు గుజ్జ కిరణ్ కుమార్, కోశాధికారి కంది మహేందర్ బాబు, సహాయ కార్యదర్శి జాడి సతీష్, కార్యవర్గ సభ్యుడు బూతగడ్డ రమేష్, స్థానిక కౌన్సిలర్ జాడి శ్రీనివాస్, సరస్వతి దేవాలయం ఫౌండర్ కటుకూరి వెంకటేష్, బిఆర్ఎస్ పట్టణ ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య, మందమర్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపతి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.