
భూపాలపల్లి నేటిధాత్రి
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి మున్సిపాలిటీ. భూపాలపల్లి రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 75 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువ కలిగిన చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. గత పాలకుల కంటే భిన్నంగా అభివృద్ధి చేస్తుంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు విసులవదేవ్ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాసు చిరుత అనిల్ కో ఆప్షన్ ఇర్ఫాన్ లబ్ధిదారులు పాల్గొన్నారు