లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి:
దండేపల్లి మండల కాసిపేట గ్రామానికి చెందిన నల్లెల మల్లయ్య అనారోగ్యానికి గురి కాగా ఆరోగ్య ఖర్చుల నిమిత్తం హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ లో వైద్యం చేయుటకు గాను రెండు లక్షల రూపాయల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా మల్లయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాది నిరుపేద కుటుంబం వైద్య ఖర్చులకు మాకు స్థోమత లేదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి తెలియ చేయగా వెంటనే స్పందించి loc ఇప్పించిన ప్రేమ్ సాగర్ రావు కి రుణపడి ఉంటామని అన్నారు