ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ డిమాండ్
హన్మకొండ, నేటిధాత్రి:
ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ….
హనుమకొండ జిల్లా భీమారం బ్రాంచ్ శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య గురువారం రాత్రి కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకినట్లుగా చెబుతున్నారని మృతురాలి బంధువులు తెలిపారు. గురువారం రాత్రి ఘటన జరిగినా.. శుక్రవారం ఉదయం వరకు తమకు సమాచారం అందించలేదని, నేరుగా పోస్ట్మార్టం తరలించాక ఫోన్లో తెలిపారని అన్నారు. విద్యార్థిని మృతిపై యాజమాన్యం గోప్యత పాటించడంపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.
ఇట్టి సమస్యపై మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ హాన్మకొండ జిల్లా కలెక్టర్ గార్లు స్పందించి విద్యార్థి మృతి పట్ల విచారణ చేపట్టి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు పై చర్యలు తీసుకొని విద్యార్థినికి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేశారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రవీందర్ సాయి ఫన్నీ రోహిత్ ప్రశాంత్ రఘు ప్రమోద్ ద్ తదితరులు పాల్గొన్నారు