మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల నేటిధాత్రి
పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు మహా శివరాత్రి సందర్భంగా కుంకుమేశ్వర స్వామి ఆలయంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ముందుగా పరకాల ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బిఆర్ యస్ నాయకులను ఇబ్బంది గురిచేస్తూ,పార్టీలు మారాలని ప్రబోలకు గురిచేస్తున్నారని,కాంగ్రెస్ పార్టీ వారు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని,కానీ అది పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి సారించారని,ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని అన్నారు.బి.ఆర్.యస్.కార్యకర్తలు ఎవరు అధైర్య పడకూడదని ప్రతి కార్యకర్తను ఏ కష్టం కలిగిన అండగా ఉంటామని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిన వారితో ఎలాంటి నష్టంలేదన్నారు.తెలంగాణ రాష్ట్ర రైతాంగంకు ఇంకా రైతుబంధు ఇవ్వని దుస్థితి ఏర్పడిందని బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ఉండేదని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో వెంట బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,నాయకులు, కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.