గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళల దినోత్సవం

చేర్యాల నేటిధాత్రి…

చేర్యాల మండల పరిధిలోని పెద్దరాజుపేట గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని పంచాయతీ కార్యదర్శి రమేష్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గూడూరు బాలరాజు పాల్గొని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామపంచాయతీ మహిళ సిబ్బంది పరమేశ్వరి గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మొగిలిపల్లి నరసింహారెడ్డి, కరోబార్ సాయిబాబా, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!