తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని గ్రామంలోని పలువురికి బిజెపి తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు చే.న్నమనేని. శ్రీధర్ రావు సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడూరు గ్రామంలో గ్రామ కమిటీ మహిళ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో పలువురు మహిళలకు శాలువా కప్పి సన్మానం చేయడం జరిగిందని మహిళలు అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి పనుల్లో ముందుగా ఉండాలని కోరుచున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీ లక్ష్మీ నవీన్ యాదవ్ తంగళ్ళపల్లి మాజీ పాక్స్ చైర్మన్ ఆసాని లావణ్య రామలింగారెడ్డి తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు కోడం భవిత మండల ప్రధాన కార్యదర్శి కలికోట కాళీ చరణ్ మంచు కట్ల ప్రసాద్ ఓ బి సి మోర్చా అధ్యక్షుడు చర్లపల్లి రవి గౌడ్ జంగం కిషన్ జూగంటి అనిల్ బోయరాజు తోటరాజు కన్నె అరుణ్ గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు