– వైభవంగా ప్రారంభమైన ఏడుపాయల జాతర…
– వన దుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు …
– మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ దంపతులు…
కొల్చారం,( మెదక్ ) నేటి ధాత్రి:-
మెదక్ జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మహాశివరాత్రి పురస్కరించుకొని శుక్రవారం ఏడుపాయల జాతర వనదుర్గ అమ్మవారి కి ప్రభుత్వం తరుపన పట్టువస్త్రాలుసమర్పించిన
కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్ దంపతులు ,
పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన వేద పండితులు పాలకమండలి సభ్యులు
అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కల్పించి తీర్థప్రసాదాలు అందించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఏడుపాయల జాతరను ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశామన్నారు మూడు రోజులపాటు జరిగే ఈ జాతరలో తొలిరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభమైన ఈ జాతర కోసం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక చింతనతో భక్తులు తాకిడి క్రమీపి పెరుగుతుందని ఆ నవదుర్గ అమ్మవారిని దర్శించుకుని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్ మీడియాతో మాట్లాడుతూ కనివిని ఎరుగని రీతిలో జాతర ఏర్పాట్లు చేశాం.
జాతర బ్రహ్మాండంగా జరగాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగిందని అన్నారు అంగరంగ వైభవంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఏడుపాయల ను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటూ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులు ఆదేశించారు
మెదక్ కుటుంబ సభ్యులకు ఏడుపాయల జాతర మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమాదేవి, ఆలయ చైర్మన్ బాల గౌడ్,
ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు