పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నందు శుక్రవారం రోజున జరిగిన మహిళ దినోత్సవం సందర్భంగా రంగోళి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా ఎంపీపి స్వర్ణలత,ఎంపిడిఓ ఆంజనేయులు,ఎంపిఓ,ఏపి ఎం,పిఎస్ లు హాజరయ్యారు.దీనిలో మండలంలోని పది గ్రామపంచాయతీల ఎస్ హెచ్జి సభ్యులు పాల్గొనగ మల్లక్కపేట గ్రామానికి చెందిన ఎస్ హెచ్ జి సభ్యులకే మూడు నగదు బహుమతులు రావడం సంతోషకరమణి గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలజ అన్నారు.అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి అధికారులు నగదు బహుమతులు అందజేశారు.ఈ సందర్బంగా శైలజ మాట్లాడుతూ మహిళల అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.మహిళలు అందరూ కూడా ఓటు హక్కును వినియోజించుకోవాలని అవగాహణ కల్పించడం జరిగినది.