పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దుప్రతి కార్యకర్తను కాపాడుకుంటం
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల నేటిధాత్రి
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రేస్ మోసాలను ఎండగట్టాలని,స్వార్థరాజకీయాల కోసం పార్టీ నుంచి వెళ్లినవారితో నష్టమేమీ లేదన్నారు.పార్టీ నుంచి ఎందుకు వెళ్లామా అని వారు కూడా తమ తప్పును గుర్తించే రోజు దగ్గరలోనే ఉందన్నారు.పార్టీ శ్రేణులు అధైర్యపడవద్దని,పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులను,కార్యకర్తలను బెదిరింపులకు పాల్డడుతూ పార్టీ మారాలని చేస్తున్న బలవంతపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చి అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.