లక్షేట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి;
లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామానికి చెందిన సొప్పరి సత్తయ్య అనే 61సంవత్సరాల వ్యక్తి పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. మృతుడు గత మూడు రోజులుగా కడుపు నొప్పితో అవస్థ పడుతున్నాడు. భార్య ఆసుపత్రికి వెళ్లి చూపించుకుందాం అంటే పండగ తర్వాత వెళ్దాం మాత్ర వేసుకుంటే తగ్గిపోద్ది అంటుండేవాడు. నిన్న రాత్రి కూడా కడుపునొస్తుంది అని భార్యతో చెప్పి తిని పడుకున్నాడు. ఉదయం లేచి పొలంకు మదుకొట్టాలని చెప్పి ఇంట్లో ఉన్న మందు ప్యాకెట్ తీసుకొని చెల్లంపేట రావికుంట చెరువు పక్కన ఉన్న పొలం వద్దకు వెళ్లి చెరువు కట్ట పై బైక్ పెట్టి మద్యం లో ఇంటినుండి తెచ్చుకున్న పంటకు కొట్టే మందు కలుపుకొని తాగి చనిపోయాడు.మృతుడి భార్య సొప్పరి గంగామని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రకుమార్ కేసు నమోదు చేసి సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు .