# బిజెపి నియోజకవర్గ చేరికల కమిటీ చైర్మన్ డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి.
# నర్సంపేటలో నారీ శక్తివందన్ కార్యక్రమం
నర్సంపేట,నేటిధాత్రి :
దేశంలో గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత
భారతీయ జనతా పార్టీకే దక్కిందని భాజపా జిల్లా నాయకులు, నియోజకవర్గ చేరికల కమిటీ చైర్మన్ డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర బిజెపి శాఖ ఆదేశాల మేరకు బుదవారం నర్సంపేట పట్టణంలో
నారీ శక్తివందన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా మాట్లాడుతూ 59 .61 లక్షల ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం అందిందన్నారు.1.12 కోట్లు ప్రధాన మంత్రి జన్ దన్ యోజన పథకం,2.5 లక్షల ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకాలు ప్రజలకు చేరాయని చెప్పారు.
సుకన్య సమృద్ధి యోజన పథకం,లోక్ సభ మరియు శాసన సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రజలను అందించారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రభారీ సత్యపాల్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు కంబంపాటి పుల్లారావు,జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్,నియోజకవర్గ కన్వినర్ వడ్డేపల్లి నర్సింహారాములు, పార్లమెంట్ కో -కన్వినర్ కట్ల రాంచంద్రా రెడ్డి, పట్టణ అధ్యక్షులు శీలం రాంబాబు గౌడ్ ,నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్స్, పార్టీ నాయకులు,పార్టీ కార్యకర్తలు, మహిళా సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.