ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పై చర్యలు తీసుకోవాలలి

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత

ట్విట్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం

స్పందించని అధికార యంత్రాంగం

ఏ బి ఎస్ ఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి: బోట్ల నరేష్

హన్మకొండ, నేటిధాత్రి:

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వివిధ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వివిధ శాఖల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమకాలు పై అవినీతి అక్రమాలకు జరిగాయని వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వివిధ దినపత్రికలు రాసినప్పటికీ అట్టి సమస్యపై ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు హన్మకొండ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ట్విట్టర్ , వాట్సప్ ద్వారా వినతి పత్రం అందజేశారు సంబంధిత ఏజెన్సీలపై ఎలాంటి శాఖ పరమైన చర్యలు తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ అన్నారు .
నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఏజెన్సీల ద్వారా నిరుద్యోగుల నుండి వివిధ శాఖలలో ఉద్యోగ నియమకాలు నియమిస్తానని నిరుద్యోగ నుండి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వలేదని స్వయంగా వివిధ పత్రికల్లో నిరుద్యోగులు చెప్పినప్పటికీ ఉమ్మడి జిల్లా అధికారులు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు కావున ఇట్టి విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,జిల్లా మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ, దానసరి అనసూయ (సీతక్క) వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్ స్పందించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ కోసం సంబంధిత జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ చే పత్రిక ప్రకటన ఇచ్చి సంబంధిత ఉద్యోగ ఖాళీల వివరాలు, తో పాటు వారి యొక్క విద్యార్హతలు తో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచిస్తారు కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా వివిధ శాఖలో భర్తీ చేసిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీ లపై చర్యలు తీసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఏ బి ఎస్ ఎఫ్ రాష్ట్ర కమిటీ తరపున కోరుతున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!