
కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :-
అదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వంచే నియమించబడిన రాహుల్ రాజ్ బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో మెదక్ జిల్లా ఐ డి ఓ సి కార్యాలయంలో సి టి సి పై సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు రమేష్, ఆర్డీవో రమాదేవి, కలెక్టర్ కార్యాలయ ఏవో
ఎండి యూనిఫ్ డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, జెడ్పి సీఈవో ఎల్లయ్య, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఏ ఈ నరసింహులు, ఏడి మైన్స్ జయరాజ్ ఇతర శాఖల అధికారులు లు కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి, ప్రజా పాలన కార్యక్రమం అమలుతీరు, ధరణి, జిల్లాలో తాగునీటి సమస్య, ఏడుపాయల జాతర నిర్వహణ విధానం వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, భూసేకరణ, ప్రజావాణి కార్యక్రమం, తదితర అంశాలపై చర్చించారు.