ఇంఛార్జీలకే పూర్తి బాధ్యతలు
సీఎం రేవంత్ చొరవతోనే ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో వేగం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఉప్పల్ నేటిధాత్రి మార్చ్05
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ సమాంతర అభివృద్ధిని చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్టుగా తెలిపారు. ఎమ్మెల్యేలు లేని చోట ఆయా నియోజకవర్గాల పార్టీ ఇంఛార్జీలకే పూర్తి బాధ్యతలు ఇచ్చి అభివృద్ధి పనులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచ్చేసి మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి చొరవతోనే ఉప్పల్‌లో ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో వేగం పెరిగిందన్నారు. రెండేళ్లల్లో పూర్తి చేయాల్సిన కారిడార్ పనులు నాలుగేళ్లు అయిన ఎక్కడి పనులు అక్కడే ఉన్నట్టుగా తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతోనే ఇప్పుడు పనుల్లో వేగం పెరిగిందన్నారు.
ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఇచ్చి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జీల సమక్షంలోనే అభివృద్ధి పనులను చేపట్టినట్టుగా తెలిపారు. ఇవే కాకుండా ఉప్పల్ నియోజకవర్గంలో జంక్షన్ల అభివృద్ధికి సైతం నిధులను కేటాయించామన్నారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ కమిటీలను సైతం ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుంటూ ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్వంలోనే అభివృద్ధి, సంక్షేమ పనులను చేపట్టనున్నట్టుగా చెప్పారు.
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు అడ్రస్ ఉండదన్నారు. పదేళ్లు రాష్ట్రంలోని సంస్థలను, వ్యవస్థలను నాశనం చేసిందని దుయ్యబట్టారు. బీజేపీ అనేది క్యాడర్ లేని పార్టీ అన్నారు.
ఈ రెండు పార్టీలకు పార్లమెంటు ఎన్నికలలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి గతంలో రేవంత్‌రెడ్డికి భారీ మెజారిటీ ఇచ్చారన్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికలలోనూ ఇదే తరహాలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్‌నే గెలువబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ,ఉప్పల్ ,చెర్లపల్లి,కాప్రా కార్పొరేటర్లు మందముల రజితాపరమేశ్వర్‌రెడ్డి, బొంతు శ్రీదేవి ,స్వర్ణరాజ్ శివమణి
,టీపీసీసీ ప్రతినిది తొఫిక్ ,ఆగి రెడ్డి ,సింగి రెడ్డి ధన్ పాల్ రెడ్డి
,అంజి రెడ్డి,రాఘవ రెడ్డి, కృష్ణా రెడ్డ, సీత రామ్ రెడ్డి , రామ్ రెడ్డి ,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రవణ్ రెడ్డి ,ఉప్పల్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ ,లింగంపల్లి రామకృష్ణ ,సుర్వి మురళి గౌడ్ , తవిడబోఈన గిరిబాబు, పత్తి కుమార్ ,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి,ఉమేష్ గౌడ్ ,బజారు జగన్ నాథ్ గారు,తెల్కల మోహన్ రెడ్డి, అమరేశ్వరి గారు , వెంకటేశ్వర్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు రఫీక్ ,బాకారం లక్ష్మణ్ ,శ్రీకాంత్ గౌడ్ ,విజయ్ ,సింగి రెడ్డి వెంకట్ రెడ్డి ,నాగశేషు ,లూకాస్ ,గరిక సుధాకర్ ,అంజయ్య ,ఆగం రెడ్డి ,తుమ్మల దేవి రెడ్డి ,ఈగ ఆంజనేయులు ,పాశికంటి నాగరాజ్ ,శ్రీనివాస్ యాదవ్ ,మాజీ కౌన్సిలర్ రాజేందర్ ,బల్ రెడ్డి ,ప్రభు ,బొక్క సురేష్ ,రాజేష్ ముదిరాజ్ ,వల్లపు శ్రీకాంత్ యాదవ్ ,పెద్ది సీను ,పోచయ్య ,పేట మురళి ముదిరాజ్ ,బిల్లకంటి యాదయ్య ,బాలయ్య బాబు ,గోపాల్ యాదవ్ ,తదితరులు పాల్గొన్నారు.