వేములవాడ నియోజకవర్గాన్ని పట్టణ కేంద్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి

-వేములవాడ డివిజన్ సిపిఎం పార్టీ నాయకత్వం విజ్ఞప్తి

వేములవాడ, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మంగళవారం రోజు సిఐటియు కార్యాలయంలో పత్రిక సమావేశం సందర్భంగా 7, వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో సిపిఎం పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాము . గత ప్రభుత్వంలో వేములవాడ టెంపుల్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి తప్పడం అనేది జరిగింది. ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేములవాడ నియోజకవర్గం మరియు పట్టణ మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అని అన్నారు.

*వేములవాడ పట్టణంలో ప్రధానమైన డిమాండ్లు

1, దేవాలయం నుంచి బ్రిడ్జి వరకు ఇరుకు రోడ్లమీద దృష్టికి కేంద్రీకరించాలి.
2, పెండింగ్లో ఉన్న మరో బ్రిడ్జి నిర్మాణం యుద్ధ ప్రాతిపదిగిన చేపట్టాలి.
3, దేవాలయంలో జరుగుతున్న అవకతవకల మీద విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలి.
4, వేములవాడ పట్టణానికి అధిక నిధులు కేటాయించి దేవాలయం మరియు పట్టణ సమస్యలపై దృష్టి సారించాలి.
5, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న వేములవాడలో అనాధ ఆశ్రమం ఏర్పాటు చేయాలి.
6, తిరుమల తిరుపతి తరహాలో ఈ వేములవాడలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏరియాలో మద్యపానం నిషేధించాలి.
7, ఈ వేములవాడ నియోజకవర్గానికి ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారు కాబట్టి సుమారు 6000, ఇండ్లు మంజూరు చేయాలని.
తదితర డిమాండ్లపై సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు ఎగమాటి ఎల్లారెడ్డి, జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యురాలు జవాజి విమల, ముక్తి కాంతా అశోక్, గురజాల శ్రీధర్, రామంచ అశోక్, మల్లార ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!