
యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం బిజెపి మండల అధ్యక్షులు కావాలి నరేందర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లె తిరుపతి మాట్లాడుతూ,
మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామ శివారులో ఉన్న దుందుభి వాగులో ఉన్న ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్న గానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుపతి ఆరోపించారు. గ్రామ సమీపంలో ప్రవహించే దుందుభి వాగు ఉండటం వల్ల గ్రామం చుట్టూ పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు నిండుగా ఉన్నాయని వారు తెలిపారు. కానీ ఇప్పుడు తోడేళ్ళ మాదిరిగా ఈ ఇసుకాసురులు ఉన్న ఇసుకను తోడేస్తుoడటం వల్ల భూగర్భజలాలు ఎడిపోతున్నాయని తిరుపతి అన్నారు. ఇదేంటని ఫిర్యాదులు చేసి ప్రశ్నించిన రైతులపై ఆ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారు దౌర్జన్యం చేస్తున్నారని ఆయన అన్నారు. వీరికి అధికారులు ,పోలీసులు వత్తాసు పలుకుతూ రైతులపై , గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారు అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే నిర్మాణాలను బూచీగా చూపించి ఇలా వాగులోని ఇసుకనంతా తోడేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని పల్లె తిరుపతి ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి సమాజానికి అన్నం పెట్టే రైతులపై దాడులు చేయడమే కాకుండా వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని అన్నారు.అయ్యవారిపల్లి గ్రామ బొడ్రాయి సాక్షిగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారి అంతు చూస్తానని చేసిన వాగ్దానం ఏమైందని తిరుపతి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. మీ మద్దతు ఇసుక మాఫియాకా లేక రైతులకా తేల్చాలని కోరారు. ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను యధేచ్చగా తీసుకుపోతూ ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా ఉదాసీన వైఖరి అవలంభించడం దేనికి సంకేతమని ఎమ్మెల్యే ను ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి ఇసుకను తవ్వేస్తూ ఈ ప్రాంతంలో అలజడులకు కారణమవుతున్న ఇసుక మాఫియా వారిపై కఠినంగా శిక్షించాలని తిరుపతి డిమాండ్ చేశారు. రేపు ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో అయ్యవారిపల్లి రైతులతో కలిసి ఇసుక అక్రమలపై వారి దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కావలి నరేందర్ , బిజెపి మండల ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి ,గిరిజన మోర్చా అధ్యక్షులు నరేష్ నాయక్, మండల కోశాధికారి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.