
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉండడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినప్పటికీ పరిశుభ్రత పాటించకపోవడంతో అందులోని వెళ్ళాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారి స్పందించి సౌచాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని పలు అవసరాల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు కోరుతున్నారు.