
వేములవాడ రూరల్ నేటిధాత్రి
వేములవాడ రూరల్ మండల పరిధిలోని చెక్కపల్లి గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘ భూమి ఆక్రమణకు గురి అవుతుందని యాదవ సంఘం కులస్తులు ఎమ్మార్వో కి వినతిపత్రం ఇచ్చినారు వివరాల్లోకి వెళితే చెక్కపల్లి గ్రామంలోని యాదవ సంఘం బీరప్ప గుడి చుట్టూ ప్రహరీ గోడ మొత్తం 17 గుంటల నర స్థలం ఇట్టి స్థలం గత 20 సంవత్సరాల క్రితం డాక్యుమెంట్ నెంబర్ 928/ 2004 గల డాక్యుమెంట్ ద్వారా సర్వేనెంబర్ 403 బి/1 లో 17 గుంటల నర భూమి గిస లసమయ్య, తండ్రి బుచ్చి మల్లయ్య గిస దేవయ్య ,తండ్రి బుచ్చి మల్లయ్య గిస లచయ్య తండ్రి నరసయ్య వారి వారసుల నుండి శ్రీకృష్ణ యాదవ సంఘం కోసం అట్టి స్థలం కొనుగోలు చేసి ఉన్నారు ఆ యొక్క స్థలంలో గ్రామపంచాయతీ అనుమతితో సంఘ భవనం నల్ల కనెక్షన్ కరెంటు మీటర్ అన్నీ కలిగి ఉన్న యాదవ సంఘం సభ్యులకు చుక్క ఎదురయింది గతంలో అమ్మినటువంటి భూమిని ఇప్పుడు వాళ్ల వారసులు భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వేములవాడ రూరల్ ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చి ఇట్టి భూమి శ్రీకృష్ణ యాదవ సంఘం కు చెందినది కావున ఇట్టి సర్వేనెంబర్ 403 బి/1 సంబంధించిన భూమిని వేరే ఇతర వ్యక్తులకు పట్టగాని లేదా భూ మార్పిడి గాని చేయరాదు అని ఇలాంటి భూ ఆక్రమణకు పలుపడుతున్న వ్యక్తుల పైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని రూరల్ పోలీసు అధికారులను కోరి చెక్కపల్లి శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు గీస మల్లయ్య జక్కుల శ్రీనివాస్ కొండవేని కిషన్ లక్కం కొమరయ్య జక్కుల మహేష్ గడ్డి రామస్వామి కొండవెని శ్రీనివాస్ సంఘ సభ్యులు వినతి పత్రం అందజేశారు అని ఒక ప్రకటనలో తెలిపారు