గ్రామ పంచాయతీ లో బ్యాక్లాగ్ డేటాకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రజలు!!!!!

ఆజ్ఞాపత్రం ఉన్న అంతర్జాలంలో కనిపించని ఇంటి యజమానుల పేర్లు!!
కొన్ని సంవత్సరాలుగా మన్యువల్ గా ఇంటి పన్ను కడుతున్న మాకు
బ్యాక్లాగ్ డేటాకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రజలు!!!
ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం లోని గుల్లకోట గ్రామంలో ఇటీవల ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న కారణం వల్ల ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యo మేర,గ్రామ పంచాయతీ పరిధిలో ,ఇంటి పన్నులు వసూలు చేపడుతున్న క్రమంలో చాలామంది గ్రామపంచాయతీలో ఇంటి నిర్మాణానికి ముందే అజ్ఞాపత్రం తీసుకొని ఇల్లు నిర్మించుకొని అప్పటినుండి మాన్యువల్ గా గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం ఇంటి పన్నులు కడుతూ వస్తున్నాం,ఆన్లైన్ లో ఉంది అనుకున్నాం కానీ ఇటీవల ఇంటి ఋణం కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆర్థిక అవసరాల నిమిత్తం బ్యాంకులకు వెళ్లినప్పుడు సదరు యజమాని బ్యాంకు వాళ్లు ఆన్లైన్ డేటా అడుగుతుండడంతో వాళ్లు అంతర్జాలం లోకి వెళ్లి చూడగా ఆన్లైన్లో వారి జాబితా కనిపించకపోవడంతో గ్రామపంచాయతీకి పరుగులు తీసి స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శులను అడిగి తమ బాధలను వ్యక్త పరుస్తున్నారు ప్రభుత్వమే ఎలాగైనా స్పందించి బ్యాక్లాగ్ డేటా అవకాశం కల్పించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా,ఉచితంగా అంతర్జాలంలో నమోదుకు అవకాశం కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు,
గ్రామ పంచాయతి కార్యదర్శి కుమార్ గుల్లకోట వివరణ
ఇట్టి విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి కుమార్ ని వివరణ అడగగా, ఇదివరకే ప్రభుత్వం కొంత కటాఫ్ సంవత్సరం పెట్టి ఆ లోపు ఆన్లైన్లో నమోదు కాని వారి కోసం బ్యాక్లాగ్ డేటాకు అవకాశం కల్పించింది ప్రస్తుతానికి బ్యాక్లాగ్ డేటా కు అవకాశం లేదు కావునకొత్తగా పర్మిషన్ తీసుకునేవారు గ్రామపంచాయతీ పరిధిలో రెండు గుంటల లోపు భూమి ఉన్న వారు , ఇల్లు నిర్మించుకోవాలి అనుకునేవారు సదరు భూమికి సంబంధించిన దృవీకరణ పత్రాలు, బ్లూ ప్రింట్, వ్యక్తి గత చిరునామా మొదలైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి, అవి తీసుకొని,దగ్గరలోని మీసేవ కేంద్రానికి వెళ్లి మీ యొక్క పేర్లను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తదుపరి మేము వెరిఫికేషన్ చేసి ఆమోదం తెలపడం జరుగుతుంది,అని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!