*తెలంగాణ రాష్ట్ర
రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్*
మంచిర్యాల, నేటి ధాత్రి:
దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు చేస్తున్న ఆందోళన దేశ ప్రజలందరినీ కలవరపరుస్తుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన మోడీ ప్రభుత్వం రైతులు చేస్తున్న ఆందోళన పై బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తుంది తాజాగా యువరైతు బుల్లెట్ల వర్షానికి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది మోడీ ప్రభుత్వం హత్యగా భావిస్తున్నాం. దేశానికి అన్నం పెట్టే రైతాంగం పై బుల్లెట్ల వర్షం కురిపించిన మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఢిల్లీలో రైతులు చేసిన ఆందోళనకు దేశ ప్రజలందరూ అండగా నిలవాల్సిన సమయం ఏర్పడింది.శాంతి యూతంగా పాదయాత్ర చేస్తూ ర్యాలీగా వస్తున్న రైతులపై కాల్పులు జరపడంతో యువరైతు శుభకరన్ సింగ్ ప్రాణాలు వదిలేయడం జరిగింది. దీనిపై సమాధానం చెప్పకుండా యాత్రల పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు మోడీ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు రైతుల ఆందోళన పై సమాధానం చెప్పిన తరువాతనే యాత్రలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా రైతు కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని రాముడు పేరుతో రాజకీయాలు వదులుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల మధ్య చీలికలు తెస్తూ ప్రజా ఐక్యతకు విఘాతం కలిగించే చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో తిప్పి కొట్టాలని పిలుపునిస్తున్నాం.