
మందమర్రి, నేటిధాత్రి:-
చిన్న పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా 0-5సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. పట్టణంలోని పాత బస్టాండ్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రపంచవ్యాప్తంగా పోలియో అంటువ్యాధిగా భావించి, ప్రజలందరూ భయపడే వారిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పల్స్ పోలియో వ్యాక్సిన్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శాంతినగర్ ఏరియాలో గృహా జ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ లబ్దిదారులకు జీరో విద్యుత్ బిల్లును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోమారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.