# టిజెఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో గల 24 వార్డులలో ఉన్న రోడ్ల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పందించి పరిష్కరించాలని తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 24 వార్డుల్లో ఉన్న 12 వేల ఇండ్లు ఉన్నాయని ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ పైప్లైన్ కలెక్షన్లు ఇస్తున్నామని గత మున్సిపల్ కమిషనర్ చెప్పారని అవి ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదని అన్నారు.అలాగే భగీరథ కనెక్షన్ తో పాటు మెగా గ్యాస్ కలెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందని కాగా పైప్ లైన్ల కోసం రోడ్లను విచ్చలవిడిగా తవ్వి వాటిని పూడ్చేపనులు నాసిరకంగా చేశారని ఆరోపించారు.అదేవిధంగా డ్రైనేజీ సమస్య, సిసి రోడ్ల నిర్మాణ సమస్య, చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో దోమల పెరిగి రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ హాస్పిటల్ ముందు గల నీటిపారుదల శాఖ ముందు మిషన్ భగీరథ పైప్లైన్ కుంగి పోయి ఐదు రోజులైనా సంబంధించిన అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం అని . పట్టణ నడిబొడ్డులో ఇలా ఉంటే 24 వార్డుల్లో ఎలా ఉంటుందో గమనించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కోరుతున్నట్లు షేక్ జావిడ్ తెలిపారు