పేదింటి అమ్మాయి పెళ్లికి పట్టుచీర

-50కిలోల బియ్యం మరియూ

-7500 రూపాయల నగదు అందజేత

-మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సంకపెల్లి గ్రామానికి చెందిన పేదింటి అమ్మాయి రెడ్డవేని సంధ్యారాణి వివాహం ఆదివారం రోజున జరగనున్న సందర్భంగా దాతల నుండి విరాళాలు సేకరించి శనివారం రోజున అమ్మాయి తల్లిదండ్రులు రెడ్డవేని గౌతమి శ్రీనివాసుకు 7500 రూపాయల నగదు, 50కిలోల జైశ్రీరాంబియ్యం, పట్టుచీర, పసుపుచీర పసుపు కుంకుమ మరియూ గాజులు అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు.

పెళ్లికూతురు తండ్రి శ్రీనివాస్ మాట్లాడుతూ మా అమ్మాయి పెళ్లికి తోబుట్టువుల్లా సాయం అందించిన దాతలను మేము జీవితంలో మరువలేమని, వారికి రుణపడి ఉంటామని సహకారం అందించిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు అన్నారు.

ట్రస్టు సభ్యులు డాక్టర్. బెజ్జంకి రవీందర్ మాట్లాడుతూ ట్రస్టు మరియూ మిగతా వాట్సాప్ గ్రూపులలో పోస్టు చెందిన 24 గంటలలోపే దాతలు మనవతా దృక్పదంతో స్పందించి విరాళాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, డాక్టర్. బెజ్జంకి రవీందర్, పొలాస రాజేందర్, చల్లా సత్తయ్య, వీరగొని ఆంజనేయులు గౌడ్, గోగికారి సత్యం, జవ్వాజి రాజశేఖర్ మరియూ అమ్మాయి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *