
బిజెపి పట్టణ అధ్యక్షుడు మార్త కుమారస్వామి
మందమర్రి, నేటిధాత్రి:-
ఆదిలాబాద్ లో నిర్వహించు విజయ్ సంకల్ప్ యాత్ర ముగింపు బహిరంగ సభకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారని,ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు మార్త కుమారస్వామి కోరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విజయ్ సంకల్ప్ యాత్ర ముగింపు బహిరంగ సభ మార్చి 4న ఆదిలాబాద్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే బహిరంగ సభకు ప్రజలంతా అధిక సంఖ్యలో హాజరై, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో బిజెపిని ఆదరించి, ఓటు వేసి, నరేంద్ర మోడీని మరొకసారి ప్రధానమంత్రి చేసి, దేశ భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు డివి దీక్షితులు, నాయకులు రొడ్డ మోహన్, ఎండి పాషా, మురుమురు రమేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బైరి శ్రీనివాస్, రాం కిష్టయ్య, శనిగారం సతీష్ తదితరులు పాల్గొన్నారు.