
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ప్రజాపంథా పార్టీ వాళ్ళ మాయ మాటలు నమ్మి వాళ్ల పార్టీ కండు కప్పుకున్నానని, మూడు విప్లవ పార్టీల విలీనం అంటే న్యూ డెమోక్రసీ పార్టీ నుండి విడిపోయిన చంద్రన్న వర్గం, ప్రజాపంద పార్టీలు ఐక్యమవుతున్నాయంటే చేరానని విలీనం అయ్యే పార్టీలు కనీసం తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలు పనిచేయడం లేదని, ఆ పార్టీల పేరు నేనెప్పుడూ వినలేదని అందుకే పునర్ ఆలోచన చేసి నా మాతృ సంస్థ అయిన న్యూ డెమోక్రసీ పార్టీలో న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి అరేం నరేష్, పర్శక రవి, ఈసం మంగన్న ల నాయకత్వంలో తిరిగిచేరుతున్నానని సుతారి నాగేశ్వరరావు, భాస్కర్ తెలిపారు.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులు అరేం నరేష్,పర్శక రవి,ఈసం మంగన్నలు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు, ఇతర పేదలకు అండగా నిలిచి ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన న్యూ డెమోక్రసీ పార్టీ చీల్చి దోపిడి వర్గ పాలక పార్టీలకు ప్రజాపంధవాళ్ళు ఉపయోగపడుతున్నారని, వీరి ఆచరణ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే బయటపడిందని నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పింది నిజం కాదా అని సవాలు చేశారు.
భాస్కర్ లాంటి వాళ్లు పునరాలోచన చేసి తిరిగి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు.
వీరి కళ్ళి బొల్లి మాటలను గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు ప్రశ్నించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దేవలగూడెం గ్రామ కమిటీ నాయకులు ఈసం కోటన్న, పూనెం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.