
రామకృష్ణాపూర్, మార్చి 01, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సూపరిండెంట్ గా విధులు నిర్వహించే డాక్టర్ ఉషారాణికి ఏసిఎంఓ గా ప్రమోషన్ వచ్చిన నేపథ్యంలో రామకృష్ణాపూర్ ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆంజనేయులు, మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, శ్రీరాంపూర్ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా,బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్ లు శాలువాతో ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ సమ్మయ్య, ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఇప్పకాయల లింగయ్య, ఫిట్ సెక్రటరీలు నాగేంద్ర, మోతే లచ్చన్న, నాయకులు శ్రీనివాస్, పోషం తదితరులు పాల్గొన్నారు.