
అన్నం ప్రవీణ్ తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి రమేష్, అన్నం ప్రవీణ్, సజ్జు, మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మూడు సంవత్సరాల లోపే ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం అనేది దేనికి సంకేతమో బిఆర్ఎస్ పార్టీ చెప్పాలన్నారు. దాదాపు లక్ష కోట్ల నిధులతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లేకుండా నిర్మించి, అది కూలిపోవడానికి కారణమైన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మేడిగడ్డలో ముక్కు నేలకు రాసి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో అనాలోచిత నిర్ణయాలతో అత్యధిక అప్పులు చేసి, కేసీఆర్ తన ఇస్టారాజ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఒక రాజుగా బాధ్యతారహితంగా వ్యవహరించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదని విమర్శించారు. కాళేశ్వరం కూలిపోవడానికి కారణమైన బిఆర్ఎస్ పార్టీఏ పూర్తి బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ ప్రజానీకాన్ని 10 సంవత్సరాలు మోసం చేసి వంచించింది కాకుండా మల్లి ఒకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని.. బిఆర్ఎస్ పార్టీ – బిఆర్ఎస్ నాయకత్వం అని విమర్శించారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే… తెలంగాణ ప్రజలు నమ్మి కేసీఆర్ కి అవకాశం ఇస్తే నీళ్లలో కుంభకోణం, నిధులలో కుంభకోణం, నియామకాలలో కుంభకోణం చేసి తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని తన మాటల గారడితో వంచించిన తీరును వివరిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న ప్రజా ప్రభుత్వానికి సహకరించి సలహాలు సూచనలు ఉంటే చేయాలి తప్ప, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే తెలంగాణ ఉద్యమకారులుగా కాకతీయ యూనివర్సిటీ న్యాయ విద్యార్థులుగా ఊరుకోమని బిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఎక్కడి కక్కడ బుద్ధి చెప్పే కార్యక్రమాలు చేపడతామని అన్నం ప్రవీణ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ పార్టీలను అసెంబ్లీ సాక్షిగా కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పరిశీలించడానికి రావాలని కోరినప్పుడు బిఆర్ఎస్ పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేసి నేడు కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ఏమో కాలేశ్వరాన్ని బొందల గడ్డగా అభివర్ణించారు మరి… ఆ బొందల గడ్డకు కేటీఆర్ ఎందుకు వెళ్తున్నాడు చెప్పాల్సిన బాధ్యత కేసిఆర్ మీద ఉందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును చంపి దాదాపు లక్ష కోట్లు నిధులను దుర్వినియోగం చేసి కాలేశ్వరాన్ని బొందల గడ్డగా మాట్లాడిన కేసీఆర్ మాటలు మరి ఇప్పుడు కేటీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పడానికి సందర్శిస్తున్నాడని హేళన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సజ్జు, బిజిగిరి శ్రీకాంత్, కారింగుల రాజేందర్, బుడిగె శ్రీకాంత్, ఏబూసి అజయ్, జియా, దిలీప్, భాను, కార్తీక్, అరుణ్, సలీం, నవీన్, అశోక్, శ్రీకాంత్, నిఖిల్, ప్రవీణ్, భాను, గణేష్, దీపక్, ప్రశాంత్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.