
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల లో విడుదల చేసిన గురుకుల సంక్షేమ ఫలితాలలో ఒకటే నెలలో నాలుగు ఉద్యోగాలు సాధించాడు డి అనిష్ . అనిష్ తండ్రి జగిత్యాల జిల్లాలోని మారుమూల గ్రామం నరసింహుల పల్లి లో చిన్న బట్టల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పేద కుటుంబంలో అయినప్పటికీ విద్యపై ఉన్న మక్కువ వలన తోటి మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఐఐటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. ఉద్యోగమే సాధించాలనే లక్ష్యంతో గత సంవత్సరం నుంచి హైదరాబాదులో ప్రిపేర్ అవుతూ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టిజిటి పిజిటి జేఎల్ మరియు డిఎల్ లలో ఉద్యోగ ఫలితాలలో సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించాడు. డిగ్రీ కళాశాల లెక్చరర్స్ లో రాష్ట్రస్థాయి నాలుగో ర్యాంకు సాధించాడు. స్కూల్ విద్య గ్రామంలోని పూర్తిచేసుకుని ఇంటర్ కరీంనగర్ లోను డిగ్రీ హైదరాబాదులో పూర్తి చేశారు. ఐఐటి హైదరాబాదు నుంచి మాస్టర్స్ కంప్లీట్ చేసి రెండు పర్యాయాలు సీఎస్ఐఆర్ జె ఆర్ ఎఫ్ ఉత్తీర్ణత సాధించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మరియు ఎన్ఐటిలో పీహెచ్డీ చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ… ఉద్యోగమే ధ్యేయంగా కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఉద్యోగానికి అధిక ప్రాధాన్య ఇచ్చాడు. ఒకటే సారి నాలుగు ఉద్యోగాలు సాధించిన అనీష్ ను తోటి మిత్రులు, బంధువులు ఊరి ప్రముఖులు అభినందించారు.