కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్
అట్టడుగు దళిత శ్రామిక నేపథ్యం నుంచి అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ప్రొఫెసర్ స్థాయి కి ఎదిగిన గురువుల సాంగత్యం వల్ల అలవడిన నిరంతరం సాహిత్య అధ్యయనమే తన జీవన శైలి గా మార్చుకొని అటు సాహితీ ప్రపంచానికి ఇటు యూనివర్సిటీ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు కృషి చేసిన ఆచార్య బన్న అయిలయ్య గొప్ప సాహితీ శిఖరం అని పేర్కొన్నారు.
గురువారం నాడు ఆర్ట్స్ కాలేజ్ లో ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ డా,,చిర్ర రాజు అధ్యక్షతన ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య పదవి విరమణ సభ జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కే.యూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆచార్య బన్న అయిలయ్య తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థులకు బోధించి ఉద్యమకారులుగ తీర్చిదిద్దారని అన్నారు. ప్రశ్నించే గొంతుకలు ఉన్నప్పుడు సమాజం బాగుపడుతుందని లేదంటే సమాజం నష్టపోతుందని యూనివర్సిటీ విద్యార్థులు, ఆచార్యులు విలువలతో కూడిన విమర్శ చేయాలని కోరారు. బన్న అయిలయ్య సాహిత్యం అన్ని వర్గాల ప్రజలను చైతన్య పరుస్తుందని యువ కవులు, రచయితలు ఆయనను ఆదర్శంగా తీసుకుని నూతన సమాజ నిర్మాణానికి దోహదపడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వక్తలు తదితరులు ఆచార్య బన్న అయిలయ్య గారు ఆర్ట్స్ కళాశాలకు ఏనలేని సేవలు చేశారని ఆచార్య బన్న అయిలయ్య దంపతులను అతిథులు, కవులు, రచయితలు, పరిశోధకులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి బన్న విజయ , ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య జి హనుమంతు గారు, కేయూ రిజిస్టర్ ఆచార్య పి మల్లారెడ్డి, కేయూసీ కోఆర్డినేటర్ ఆచార్య మల్లికార్జున్ రెడ్డి, డివో వాసుదేవ రెడ్డి, ఆర్ట్స్ కాలేజ్ ఫ్యాకల్టీ క్లబ్ వైస్ చైర్మన్ బిక్షపతి గారు, కో కన్వీనర్ డాక్టర్ కనకయ్య, శ్రీలత, డాక్టర్ సునీత గారు తదితరులు దాదాపు 1100 విద్యార్థులు పాల్గొన్నారు.