ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.
హెల్మెట్ ధరించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలి.
జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ ఐపిఎస్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ ప్రధాన అధికారి కార్యాలయం నందు రహదారి భద్రతా, ప్రమాదాల నివారణ, సిపిఆర్ అవగాహన మరియు 2కే రన్ కార్యక్రమం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్,నిర్వహించిరు.
ప్రతినిత్యం ఎన్నోరకాల ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, రోడ్డుప్రమాదంలో ప్రతినిత్యం నిముషానికి ఒక్కరిచొప్పున చనిపోతున్నారు దీనికి కారణం రోడ్డు భద్రత మరియు ప్రమాదాలపై అవగాహన లేకపోవడం, ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు రహదారి భద్రత మరియు ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించిరు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ …ప్రయాణికులకు, ప్రజలకు, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. రోడ్లకు
ఇరువైపులా ఏర్పాటుచేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీ గా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సూచించారు.
వాహనదారులలో ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని తెలిపారు. పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కు చేసుకోవాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దని తెలిపారు. జరిమానా ఫైన్లు వేయడం మా అభిమతం కాదని ప్రమాదాల నివారణ గురించి రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై మాత్రమే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
రోడ్డుప్రమాదంలో అపస్మారక స్థితిలో వున్న వారిని సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు ఎలా కపాడలో సిపిఆర్ నిర్వహించే విధానం గురించి గవర్నమెట్ డాక్టర్ తో శిక్షణా నిర్వహించారు.
గత కొద్దరోజుల క్రితం అపస్మారక స్థితిలో వున్న మహిళకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బంది, రామ్ గోవర్ధన్, ఏ ఆర్ ఎచ్ సి -2138, వెంకట్ కుమార్, ఏ ఆర్ పి సి -614, డాగ్ స్క్వాడ్ రఘు మరియు డ్రైవర్ శివ, నలుగురికి ప్రశంశా పత్రాలను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీస్ చిత్తరంజన్, అదనపు ఎస్పీ రాములు, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీస్పీ లు, గవర్నమెట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.