
మందమర్రి, నేటిధాత్రి:-
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్ను బకాయిల చెల్లింపులో 90 శాతం రాయితీ కల్పించిందని బకాయిధారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటి పన్ను బకాయిలను సకాలం లో చెల్లించాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నివాస గృహం పాత బకాయి దారులు మార్చి 03వ తేదీలోపు వన్ సెటిల్ మెంట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం 90 శాతం రాయితీ కల్పించిందని, దీనిని సద్వినియోగం చేసుకొని బకాయిలు చెల్లించాలని కోరారు. అలాగే నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్, ఎంక్రొచ్ మెంట్ పన్నులు ఇతర పన్నులను బాకాయిధారులు మార్చి 03వ తేదీ లోపు బకాయిలు చెల్లించి పట్టణ అభివృధ్దికి సహకరించాలని కోరారు. బకాయిలు చెల్లించని పక్షంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు.