
విప్లవోద్యమం ఐక్యత కోసమే మాస్ లైన్
కారేపల్లి నేటి ధాత్రి.
మార్చి 3,4,5 తేదీలలో జరుగు సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ యూనిటీ జాతీయ మహాసభల ను జయప్రదం చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) సంయుక్త మండలాల కమిటీ కార్యదర్శి గుమ్మడి సందీప్, సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్, డివిజన్ నాయకులు గుగులోతు తేజ అన్నారు
గురువారం నాడు యూనిటీ మహాసభలను జయప్రదం చేయాలని మండల వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 3,4,5 తేదీలలో ఖమ్మంలో జరిగే సీపీఐ(యం.యల్) ప్రజాపంథా,పీసీసీ సీపీఐ (యం.యల్), సీపీఐ (యం.యల్) ఆర్.ఐలు నిర్దిష్ట పరిస్థితులను, నిర్దిష్ట విశ్లేషణను కనుగొనే ప్రయత్నంలో గ్రహించినదేమంటే, ప్రధానమైన విషయాలలో అంగీకారం తో పై మూడు పార్టీలు ఐక్యమై “సీపీఐ (యం.యల్) మాస్ లైన్ అనే ఒక క్రొత్త పార్టీగా ఆవిర్భవించింది.మార్చి 3,4,5 తేదీ లో ఐక్య పార్టీ యొక్క యూనిటి మహాసభల ను ఖమ్మంలో నిర్వహించడం జరిగింది.భారతదేశాన్ని అనేక సామ్రాజ్యవాద శక్తులచే అణచివేయబడిన మరియు దోపిడీకి గురయిన పెట్టుబడిదారీ పూర్వ అవశేషాలతో కూడిన, వెనుకబడిన పెట్టుబడిదారీ దేశంగా పేర్కొంది. స్వదేశీ మరియు బూర్జువా ఉత్పత్తి విధానంలో పాతుకు పోయిన బడాబూర్జువా వర్గం ద్వారా సామ్రాజ్యవాదులు వారి అణచివేత దోపిడీ విధానాలను కొనసాగిస్తున్నారు. అలాగే బూర్జువాల మనుగడ, అభివృద్ధికి సామ్రాజ్యవాదులతో వారు కలిగివున్న జూనియర్ భాగస్వామ్యం అవసరంగా వుంటుంది. ఇది వారిని మూలధనం, సాంకేతిక మరియు మార్కెట్ల యొక్క కీలకమైన వెసులుబాటుకు సహాయపడుతుంది.అయితే సామ్రాజ్యవాదులతో భాగస్వాములుగా ఉన్న ఈ బూర్జువాలు సాధారణ పరిస్థితుల్లో సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకి లోబడి ఉంటారు.దేశంలో మతోన్మాదం ను పెంచి పోషిస్తున్న బిజెపి,ఆర్ఎస్ఎస్ విధాలాలను వ్యతిరేకించాలని మనుషులంతా స్వేచ్ఛ సమానత్వంతో జీవించాలని వారు అన్నారు. అట్లాగే 3 తేదీన ఖమ్మంలో వేలాది మందితో ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ 4,5 తేదీ లో జరిగే ప్రతినిధుల సభను జయప్రదం చేయాలని ప్రజలకు ప్రజాస్వామ్య వాదులకు వారు పిలుపునిచ్చారు.
రాష్ట్రాల నుంచి వేలాదిమందిగా తరలివస్తున్న విప్లవ అభిమానులకు ఖమ్మం ఆతిథ్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఖమ్మం గడ్డపై జరిగే మహాసభలకు అత్యధిక సంఖ్యలో ఖమ్మం ప్రజలు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు మూడో తారీఖు నాడు గ్రేట్ మార్చ్ ర్యాలీ ప్రదర్శన పెవిలియన్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం సింగరేణి మండలం టేకులగూడెం నుంచి ప్రారంభమై తొడితల గూడెం సీతారాంపురం ఉసిరికాయ పల్లి పోలంపల్లి పేరేపల్లి గుంపెల్ల గూడెం మాదారం కారేపల్లి వరకు అనంతరం విశ్వనాథపల్లి కారేపల్లి క్రాస్ రోడ్ వరకు ప్రదర్శన నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ప్రజాపంథా మండల నాయకులు వడ్డే వెంకటేశ్వర్లు భాస్కర్ సత్తిరెడ్డి, చల్ల రాజు, తాటి పాపారావు, రావుల నాగేశ్వరరావు కొయ్యల శ్రీను వేములపల్లి వీరన్న కనకరాజు రాము సోమనబోయిన ఉపేందర్ భూక్య శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.