
# తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కుడికాల భాస్కర్
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కుడికాల భాస్కర్ అన్నారు. నర్సంపేట మార్కండేయ కాలనీలో మార్కండేయ కాలనీ కమిటీ బాధ్యులతో చేనేత ఐక్యవేదిక నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండి వారికి ప్రోత్సాహాలు అందించే విధంగా చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర భాస్కర్ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పద్మశాలీల పక్షాన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా పద్మశాలి కుల బాంధవులకు అందే విధంగా తెలంగాణ చేనేత ఐక్యవేదిక పోరాటం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని పద్మశాలి కుల బాంధవులను ఐక్యత చేసే విధంగా పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్, కార్యదర్శి సుభాష్, ఉపాధ్యక్షులు ఆడెపుకొమ్మాలు,ముఖ్య సలహాదారులు జడల శ్రీనివాస్, గొల్లపల్లి మల్లేశం, కమిటీ సభ్యులు అందే సాంబయ్య , శ్రీనివాస్, పుట్ట రాజు, కనక కుమారస్వామి, బయ్య రాము, జడల రాహుల్ తోపాటు పలువురు పాల్గొన్నారు.