
# కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వయి హరీష్…
# ఆరు గ్యారెంటీల తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్..
# క్లస్టర్ ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు.
# దోపిడీచేసే కుటుంబ పార్టీలకు ఓటు వేయద్దు..
# బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్..
# నర్సంపేటలో విజయ సంకల్ప యాత్రలో భాజపా నాయకులు..
నర్సంపేట,నేటిధాత్రి :
రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, ధర్మబద్ధమైన మోదీ పాలన కావాలో, అవినీతి, దోపిడీమయమైన కాంగ్రెస్ పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న విజయసంకల్ప సభలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలో కాకతీయ భద్రకాళి క్లస్టర్ విజయసంకల్ప బస్సు యాత్ర నర్సంపేట నుంచి నల్లబెల్లి, మల్లంపల్లి మీదుగా ములుగు, భూపాలపల్లి , పరకాల వరకు సాగనున్నది. ఈ యాత్రకు ముఖ్యఅతిథిగా కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ తో పాటు కాకతీయ భద్రకాళి క్లస్టర్ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు, కాకతీయ క్లస్టర్ యాత్ర ప్రముఖ్ చాడ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని యాత్రను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని అన్నారు. 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారతదేశంలో అంతర్భాగం చేసిన ఘనత నరేంద్రమోడీకి దక్కిందన్నారు.జాతీయ రహదారులు, వెలుగుతున్న లైట్లు, ఐదు కేజీల బియ్యం, ఉపాధి హమీ పనులు, సిమెంట్ రోడ్లు కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలోనే ఏర్పాటు చేసినట్లు వివరించారు. క్లస్టర్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ మూడు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఎలా అధికారం చేపడుతుందని ఎద్దేవా చేశారు.ఆరు గ్యారెంటీల తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నేడు అవి అమలు చేయలేకపోతున్నదని ఆరోపించారు. హిందువుల రామ మందిర నిర్మాణం 500 సంవత్సరాల కల నరేంద్రమోదీ నాయకత్వంలో సహకారమైందన్నారు. కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ కు ఓటు వేసి వృథా చేసుకోవద్దన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నది జోస్యం చెప్పారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తోందని అన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వేమార్గాలు మంజూరు చేసిందన్నారు. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలన్నింటిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నదన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గానీ, బీఆర్ఎస్ పార్టీ గానీ వాళ్ల కుటుంబాల కోసం ఆలోచన చేస్తాయే తప్ప దేశం కోసం, ప్రజల బాగుకోసం ఆలోచించదని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, నేషనల్ హై వేస్, విమానాశ్రయాల నిర్మాణం ఇలా అన్నింట్లోనూ మనం ముందుంజలో ఉన్నామని చెప్పారు. మోడీ మళ్ళీ అధికారంలోకి రావాలి.. భారత దేశం వికసించాలని విజయ సంకల్ప యాత్ర చేస్తున్నట్లు రవికుమార్ చెప్పారు. సంకల్పంతో మరోసారి మోడీ గారిని ప్రధాని చేయాలని ప్రధానిని చేసుకుందామని,మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలని గంట రవికుమార్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో బీజేపీ 12 నుండి 15 ఎంపీ సీట్లకుపైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని ప్రగతిని, ప్రపంచ గుర్తింపును 10 ఏళ్లలోనే ప్రధాని మోడీ చేసి చూపించారని పేర్కొన్నారు. విజయ సంకల్ప సభ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఎడ్ల అశోక్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, నర్సంపేట కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కంభంపాటి పుల్లారావు, ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహులు, డాక్టర్ గోగుల రానా ప్రతాపరెడ్డి, మాజీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మల్యాల వినయ్ కుమార్ గుప్తా, టౌన్ ప్రెసిడెంట్ బాల్ని జగన్, నర్సంపేట మున్సిపల్ కౌన్సిలర్లు, నల్లబెల్లి మండల నాయకులు మరియు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, పలు మోర్చా నాయకులు, బిజెపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.