కెవిపిఎస్ డైరీ ఆవిష్కరించిన డి.ఎస్.పి

యువతను సన్మార్గంలో నడిపించాలి:డిఎస్పి రామ్మోహన్ రెడ్డి

కాటారం నేటి ధాత్రి

కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డైరీ నీ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్ మాట్లాడుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పడిన 24 సంవత్సరాల కాలంలో సమాజంలో అసమానతలు ఉండకూడదని కుల వివక్ష,లింగ వివక్ష నేరం అని బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంగా జీవించాలని అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ వచ్చిందని అదేవిధంగా సమాజంలో వివక్ష కనుమరుగు కావాలంటే కులాంతర వివాహాలు జరగాలని వారికి ప్రభుత్వమే ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి ప్రోత్సహించాలని కులాంతర వివాహితుల ప్రోత్సాహకం జీవో నెంబర్ 12 ను పోరాడి సాధించిందని అదేవిధంగా దళితులు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించడానికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పోరాడి సాధించిందని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి దోహదపడే అనేక కార్యక్రమాలు కెవిపిఎస్ చేసిందని అన్నారు. అదేవిధంగా డిఎస్పి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కెవిపిఎస్ డైరీ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని డైరీలో మహనీయుల జీవిత ముఖ్య ఘట్టాలతో పాటు సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఫోక్సో చట్టం, విద్య హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి నిధి చట్టం, అత్యాచారాల నిరోధక చట్టం, కేసులు సెక్షన్లు, అట్రాసిటీ చట్టం అదేవిధంగా రాజ్యాంగం లోని ముఖ్యమైన ఆర్టికల్స్ లాంటి సమాచారం ఉందని ఇలాంటి డైరీల వల్ల చట్టాల పైన ప్రజలు అవగాహన కలిగి నేర ప్రవృత్తికి దూరంగా ఉండే అవకాశం ఉందని అదేవిధంగా సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ యువతను సన్మార్గంలో నడిపించే కార్యక్రమాలు చేయాలని అలాంటి విషయంలో మా సాకారం మీకు ఎల్లవేళలా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్, సుధాకర్, రజనీకాంత్, తిరుపతి తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *