శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి

విజ్ఞాన దర్శిని జిల్లా కన్వీనర్ – పెండ్యాల సుమన్

హసన్ పర్తి/ నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల లో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగ నిర్వచించారు. ఈ సదస్సుకి విజ్ఞాన దర్శిని ఫౌండర్ అండ్ ఛైర్మన్ రమేశ్ హాజరయ్యారు ఈ సంధర్భంగా రమేశ్ మాట్లాడుతు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏంతో అభివృద్ది చెందిన కూడా అమాయక ప్రజలు మూఢ నమ్మకాల పేరుతో మాన, ధన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు ప్రతి విద్యార్థి శాస్త్ర వేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దొంగ బాబాలు చేసే మేజిక్ లను చేసి అందులోని రహస్యాలను విద్యార్థులకు వివరించారు. అలాగె జిల్లా కన్వీనర్ పెండ్యాల సుమన్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి శాస్త్ర వేత్తలు మహనీయుల త్యాగాలే మూలమన్నారు ఈ కార్యక్రమంలో మహిళ కన్వీనర్ ముత్యాల స్రవంతి, అలీ, నవీన్, ప్రసాద్, మరియు కళాశాల ప్రిన్సిపాల్ శారద అధ్యాపక బృందం పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!