చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ రెడ్డి జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సైన్స్ పాత్ర మరువలేనిదని అన్నారు. సర్ సివి రామన్ ఎంతో కృషి చేశారని వారి సేవలను విద్యార్థులకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం మల్లేశం, మల్లికార్జున్, విద్యార్థులు పాల్గొన్నారు.