
ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నీలకంఠ స్వామి దేవాలయం లో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ భజన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్టంలో ఎక్కడ లేని విధంగా ఇంటింటా భజన కార్యక్రమంను అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. నీలకంఠ స్వామి దేవాలయ అభివృద్ధికి తన హయాంలో రూ . 5 లక్షలు ఇచ్చినట్టు చెప్పారు. రాన్నున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్ రామలక్ష్మణ్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, ప్రచార సమితి సభ్యులు నరేందర్, సతీష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నవకాంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.